Alwal: మతిస్థిమితం లేని యువకుడు 'అఖిల్' అదృశ్యం!

Alwal: మేడ్చల్ జిల్లా అల్వాల్ అంబేద్కర్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల మానసిక వికలాంగ యువకుడు అఖిల్ గత ఆదివారం నుండి కనిపించకుండా పోయాడు.

PURENDAR, ALWAL
Published on: 2 Aug 2026 6:00 PM IST
Alwal
X

Alwal: మతిస్థిమితం లేని యువకుడు 'అఖిల్' అదృశ్యం!

ఆల్వాల్: చిన్ననాటినుండి మానసిక వైకల్యంతో ఉన్న 24 ఏళ్ల యువకుడు అఖిల్ కనిపించకుండా పోయి వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో కుమారుడి కోసం తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

అంబేద్కర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్దనున్న తన నివాసం నుండి గత ఆదివారం ఉదయం 11 గంటలకు బయటకు వెళ్ళిన అఖిల్ ఆచూకీ వారం రోజులైనా తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు రామాచారి, ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

కాగా దివ్యాంగుడైన అఖిల్ కు సరిగ్గా మాటలు రావని, కనీసం తన అడ్రస్ గానీ, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ గాని ఎవరికి చెప్పలేడు కాబట్టి ఈ కేసును పోలీసులు ప్రత్యేకంగా గుర్తించి గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఈ యువకుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని లేదా 9866784884 నంబర్ కు సమాచారం అందివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL

Next Story