Hyderabad: గుడ్డు పరిశ్రమలో కోడిపిల్లలపై క్రూరత్వం: నిరసన!

Hyderabad: గుడ్డు పరిశ్రమలో మగ కోడిపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని నిరసిస్తూ ‘మెర్సీ ఫర్ యానిమల్స్’ సంస్థ హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో వినూత్న నిరసన చేపట్టింది.

GIRI, CENTRAL ZONE
Published on: 8 Oct 2026 4:47 PM IST
Hyderabad
X

Hyderabad: గుడ్డు పరిశ్రమలో కోడిపిల్లలపై క్రూరత్వం: నిరసన!

హైదరాబాద్: గుడ్డు పరిశ్రమలో కోడిపిల్లలపై జరుగుతున్న క్రూరత్వాన్ని నిరసిస్తూ ‘మెర్సీ ఫర్ యానిమల్స్’ సంస్థ ప్రతినిధులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో భారీ మిక్సీలో చిక్కుకున్న కోడిపిల్లను ప్రతిబంబించే భారీ ప్లకార్డు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆధునిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ గుడ్డు పరిశ్రమలో క్రూరమైన పద్ధతులను కొనసాగించడం అమానవీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 700 కోట్ల మగ కోడిపిల్లలు హతమవుతున్నాయని తెలిపారు.

గుడ్లు పెట్టే లేయర్‌ జాతికి చెందిన మగ కోడిపిల్లలు గుడ్లు పెట్టలేవని, బ్రాయిలర్‌ కోళ్ల మాదిరిగా మాంసం ఉత్పత్తికి కూడా ఉపయోగపడవని పేర్కొన్నారు. దీంతో వాటిని పరిశ్రమలో ఆర్థిక భారంగా పరిగణిస్తున్నారని చెప్పారు. గుడ్డు నుంచి బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే ఆ పసి ప్రాణాలను చంపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ సహా దేశంలోని పలు హ్యాచరీల్లో నిర్వహించిన పరిశోధనల్లో కోడిపిల్లలను గ్రైండర్లలో వేసి రుబ్బడం, కాళ్లతో తొక్కి చంపడం, సజీవంగా కాల్చడం వంటి ఘటనలను గుర్తించామని తెలిపారు. ఈ క్రూరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుడ్ల వినియోగంపై పునరాలోచించి, వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE