Pargi: పరిగిలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు భారీ ర్యాలీ!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జామే మసీదు నుంచి గాంధీ చౌక్ వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ చేపట్టారు.
Pargi: పరిగిలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు భారీ ర్యాలీ!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జామే మసీదు నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ.. కొడంగల్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా చేరుకుని, అక్కడి నుంచి గాంధీ చౌక్ వరకు కొనసాగింది.
ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని, మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుతూ ముందుకు సాగారు. ర్యాలీ మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లు కనిపించాయి.ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలను నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.శాంతి, సోదరభావం, ఐక్యతను చాటుతూ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Next Story




