Hyderabad: భరతోదయం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు!
Hyderabad: హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో ఆచార్య డా. దేవరాజు రాంభావు రచించిన 'భరతోదయం' మహాపద్యకావ్యాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు ఘనంగా ఆవిష్కరించారు.
Hyderabad: భరతోదయం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు!
హైదరాబాద్: ఆచార్య డా. దేవరాజు రాంభావు రచించిన "భరతోదయం" మహాపద్యకావ్యం ఘనంగా ఆవిష్కరించబడింది. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు.
విజ్ఞాన శాస్త్రం, సాహిత్యాల అపూర్వ కలయికగా ఆచార్య రాంభావు వ్యక్తిత్వాన్ని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా రచయిత దంపతులను ఘనంగా సత్కరించడంతో పాటు ఆయన రచించిన మరో మూడు పద్య కృతులను కూడా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కవులు, రచయితలు పాల్గొని రాంభావు సాహిత్య సేవలను ప్రశంసించారు.
Next Story




