Bandlaguda: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం!

Bandlaguda: బండ్లగూడ ఎక్సైజ్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ పరేడ్. 117 మంది కొత్త అధికారులకు శిక్షణ పూర్తి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Jun 2026 3:41 PM IST
Bandlaguda
X

Bandlaguda: యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం!

Bandlaguda: బండ్లగూడ జాగీర్ లోని ఎక్సైజ్ అకాడమీలో ఘనంగా దిక్షాంత్ పరేడ్

అసిస్టెంట్ సూపరింటెండెంట్స్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ల దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)

ముఖ్య అతిథిగా హాజరైన ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

పాసింగ్ అవుట్ పరేడ్‌లో గౌరవ వందనం స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఆరు నెలల శిక్షణ పూర్తి చేసిన 117 మంది అధికారులు

117 మందిలో 33 మంది మహిళా అధికారులు, 84 మంది పురుష అధికారులు

24 మంది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 89 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు

శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన

విజేతలకు పురస్కారాలు అందజేశారు

మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎక్సైజ్ శాఖలో మహిళల భాగస్వామ్యం పెరగడం మహిళా సాధికారతకు నిదర్శనం

పాసింగ్ అవుట్ పరేడ్ ప్రజాసేవకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ

తెలంగాణ అమరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఆవిర్భావం

ఉద్యోగం అభ్యర్థుల కష్టార్జిత విజయంతో పాటు అమరుల త్యాగాల ఫలితం

శిక్షణతో చట్టాలపై అవగాహన, విచారణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందాయి

అసలు పరీక్ష క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణలోనే మొదలవుతుంది

యూనిఫాం హోదాకు కాదు.. ప్రజల విశ్వాసానికి ప్రతీక:

ఉద్యోగంతో పాటు సమాజం పట్ల గొప్ప బాధ్యతను అధికారులు స్వీకరిస్తున్నారు

ఎక్సైజ్ శాఖ కేవలం ఆదాయ శాఖ కాదు.. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక విభాగం

యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడే బాధ్యత అధికారులపై ఉంది

డ్రగ్స్, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి

తెలంగాణలోకి మాదకద్రవ్యాలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి

యువత భవిష్యత్తును కంటికి రెప్పలా కాపాడాలి

గంజాయి, మద్యం అక్రమ రవాణా ముఠాలపై కఠిన చర్యలు తప్పవు

అక్రమార్కులు ఎంతటివారైనా చట్టం ముందు అందరూ సమానమే

నాడు నాటుసారా, గుడుంబా, కల్తీ కల్లు

నేడు సింథటిక్ డ్రగ్స్, మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లు కొత్త ముప్పుగా మారాయి

ఇప్పుడు డ్రగ్స్ నెట్‌వర్క్‌ల వరకు సవాళ్లు మారాయి

ఆన్‌లైన్ వేదికల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై ప్రత్యేక నిఘా అవసరం

మారుతున్న నేర ధోరణులకు అనుగుణంగా అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు పురస్కారాలను మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ ఖురేషీ, అకాడమీ డైరెక్టర్ సురేష్, జాయింట్ కమీషనర్ అంజన్ రావు, జాయింట్ డైరెక్టర్ శశిధర్ రెడ్డి, చీఫ్ డ్రిల్ ఇన్‌స్పెక్టర్ రంగారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, శిక్షణార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story