Hyderabad: దేవాదాయ భూముల కబ్జాదారులపై మంత్రి కొండా సురేఖ ఉక్కుపాదం!

Hyderabad: అబిడ్స్ బొగ్గులకుంటలో దేవాదాయ మంత్రి కొండా సురేఖ 51 మందికి ఈవోలుగా ప్రమోషన్ ఆర్డర్లు ఇచ్చారు. దేవుడి భూముల రక్షణకు టాస్క్ ఫోర్స్ వేస్తామని ప్రకటించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 29 July 2026 11:43 PM IST
Hyderabad
X

Hyderabad: దేవాదాయ భూముల కబ్జాదారులపై మంత్రి కొండా సురేఖ ఉక్కుపాదం!

హైదరాబాద్: అన్యాక్రాంతం అయిన దేవాదాయ శాఖ భూములను పరిరక్షించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కబ్జాదారుల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొనేందుకు , ఏళ్ల తరబడి కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతామన్నారు.

హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంటా లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో 51 మంది దేవాదాయశాఖ ఉద్యోగులకు ఈవోలుగా పదోన్నతి ఉత్తర్వులను మంత్రి అందజేశారు. అలాగే అర్చక సంక్షేమ నిధి ద్వారా పదవీ విరమణ చేసిన అర్చకులకు గ్రాట్యుటీ ఉత్తర్వులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూసిన ఉద్యోగులకు , కాంగ్రెస్ ప్రభుత్వం ఈవోలుగా పదోన్నతి కల్పించిందన్నారు. తాము రిటైర్డ్ అయ్యే లోపు పదోన్నతి దక్కుతుందో లేదో అనే ఆవేదనలో ఉద్యోగులు ఉండేవారని తెలిపారు. తమ ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు దేవాదాయశాఖకు మంచి పేరు వచ్చేలా పని చేయాలని మంత్రి ఆకాంక్షించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story