Hyderabad: ఎల్బీనగర్ కేంద్ర మంత్రి రాజీనామాకు పొన్నం డిమాండ్
Hyderabad: పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్. ఎల్బీనగర్‌లో విద్యార్థులతో ముఖాముఖి.
Hyderabad: ఎల్బీనగర్ కేంద్ర మంత్రి రాజీనామాకు పొన్నం డిమాండ్
హైదరాబాద్: ఎల్బీనగర్ లోని SVL ఏరినా లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన "ఛాత్రోన్ కా గూంజ్ - స్టూడెంట్ ఇంటరాక్షన్" కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. "మనం కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి, ప్రభుత్వ అసమర్థత వల్ల పేపర్ లీక్ అయితే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ గారు సరైన విద్యా విధానం రావాలని పోరాడుతున్నారని, ఈ పోరాటంలో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని కోరారు. తల్లిదండ్రుల సూచనలతో భవిష్యత్ భారతదేశ నిర్మాణం ఉండాలని, విద్యా విధానంలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. "ప్రపంచంలో ఏదైనా మార్చగలిగే శక్తి విద్యార్థి లోకానికి ఉంది. ఆనాడు కాలేజీ ఎన్నికల్లో విద్యార్థి నాయకుడిగా గెలిచి, NSUI అధ్యక్షుడిగా, MP గా, మంత్రిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఎంతటి శక్తినైనా మనం మార్చగలుగుతాం" అని స్ఫూర్తి నింపారు.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షా ల నాయకత్వంలో జరుగుతున్న అవినీతి, పేపర్ లీకేజీలపై పోరాడాలని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహించి దేశంలోని విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ గారి పోరాటంలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.




