Malkajgiri: మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా మౌలాలి బాధితులకు ఆర్థిక సాయం!

Malkajgiri: ఇందిరమ్మ మైనారిటీ పథకం ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.50 వేల చెక్కులు అందించిన మంత్రి శ్రీధర్ బాబు.

Bodike Manohar, Malkajgiri
Published on: 1 Sept 2026 6:31 PM IST
Malkajgiri
X

Malkajgiri: మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా మౌలాలి బాధితులకు ఆర్థిక సాయం!

Malkajgiri: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళా యువజన పథకం ద్వారా మౌలాలి డివిజన్‌కు చెందిన అర్హులైన మైనారిటీ వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు రూ.50 వేల విలువైన చెక్కులను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందజేశారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు 186 మౌలాలి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోతుల వినోద్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీ మహిళల ఆర్థిక స్వావలంబనకు అందిస్తున్న సహాయం అభినందనీయమన్నారు.అర్హులైన మరింత మంది మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హమీద్, ఫారూఖ్, షకీల్, ప్రేమ్, జాన్వి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story