Hyderabad: షూటర్ ఈషా సింగ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు!

Hyderabad: ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించిన తెలంగాణ షూటర్ ఈషా సింగ్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా అభినందనలు తెలిపారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 28 Sept 2026 7:07 PM IST
Hyderabad
X

Hyderabad: ఆసియా క్రీడలు–2026లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన తెలంగాణకు చెందిన ఏస్‌ షూటర్‌ ఈషా సింగ్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించడం తెలంగాణకు, దేశానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. కఠినమైన పోటీలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి పోడియంపై నిలిచిన ఈషా సింగ్‌ను మంత్రి అభినందించారు.

తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad