Hyderabad: మాలల హక్కుల కోసం ఉద్యమం మంత్రి వివేక్ సంఘీభావం

Hyderabad: రోస్టర్ పాయింట్ల సవరణ కోరుతూ దీక్ష చేస్తున్న నేషనల్ అంబేద్కర్ సేనకు మంత్రి వివేక్ మద్దతు. మాలల హక్కుల సాధనలో ముందుంటానని మంత్రి స్పష్టం.

RAJESH,	WEST ZONE
Published on: 11 July 2026 3:30 PM IST
Hyderabad
X

Hyderabad: మాలల హక్కుల కోసం ఉద్యమం మంత్రి వివేక్ సంఘీభావం

హైదరాబాద్: తనకు పదవుల కంటే , మాలలు హక్కులే ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. రోస్టర్ పాయింట్స్ సవరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని చింతల బస్తీలో ది నేషనల్ అంబేద్కర్ సేన అధ్యక్షుడు మన్నే శ్రీధర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షకు మంత్రి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాలలు ఐక్యంగా ఉద్యమించినప్పుడే హక్కులు దక్కుతాయన్నారు. ఎస్సి వర్గీకరణ కారణంగా మాలలు అన్యాయానికి గురవుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. రోస్టర్ పోయింట్లు సవరించి , మాలలకు దక్కాల్సిన ఐదు శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను ముందుంటానని స్పష్టం చేశారు.

ఎస్సీ గ్రూప్-3లోని మాలలతో పాటు 25 ఉపకులాలకు మొదటి రోస్టర్ పాయింట్‌ను ప్రస్తుతం ఉన్న 22వ స్థానం నుంచి 16వ స్థానానికి మార్చాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. పెంచే అదనపు 3 శాతం రిజర్వేషన్లను మాల ఉపకులాలకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేషనల్ అంబేద్కర్ సేన నాయకులు హెచ్చరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story