Hyderabad: మీర్పేట్ పీఎస్‌లో కలకలం.. సీజ్ చేసిన డబ్బులు, బంగారం కాజేసిన కానిస్టేబుల్!
Hyderabad: మీర్పేట్ పీఎస్‌లో కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్.. కేసులో సీజ్ చేసిన మొబైల్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి, 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన ఘటనలో అరెస్టయ్యాడు.
Hyderabad: మీర్పేట్ పీఎస్‌లో కలకలం.. సీజ్ చేసిన డబ్బులు, బంగారం కాజేసిన కానిస్టేబుల్!
Hyderabad: మీర్పేట్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ పై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు. ఒక కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఏకంగా రూ.1,70,000 (లక్షా డెబ్బై వేల రూపాయలను) తన బంధువులకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అదే కేసులో స్వాధీనం చేసుకున్న 12 తులాల బంగారు ఆభరణాలను సైతం తాకట్టు పెట్టాడు.
ఈ ఘటనపై మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కానిస్టేబుల్ శ్రవణ్ ని రిమాండ్ చేశారు.




