Attapur: శంషాబాద్ అత్తాపూర్ పరిధిలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలకు నిప్పు

Attapur: అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతీనగర్‌లో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన అగంతుకులు. జుపిటర్ బైక్ దగ్ధం, పోలీసుల కేసు నమోదు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 23 Aug 2026 12:44 PM IST
Attapur
X

Attapur: శంషాబాద్ అత్తాపూర్ పరిధిలో అర్ధరాత్రి ద్విచక్ర వాహనాలకు నిప్పు

Attapur: ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టిన అగంతకులు. ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మారుతీనగర్‌లో కలకలం రేపింది. ఇంటి ముందు నిలిపి ఉంచిన జుపిటర్ వాహనానికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.

జుపిటర్ పక్కనే పార్క్ చేసి ఉన్న మరో ద్విచక్ర వాహనం షైన్‌కు కూడా మంటలు వ్యాపించడంతో కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వాహనాలకు నిప్పుపెట్టిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనకు గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD