Medchal: మురహరిపల్లి చెరువు కట్టపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం!

Medchal: మేడ్చల్ మురహరిపల్లి చెరువు కట్టపై గుండ్లపోచంపల్లికి చెందిన నేమారం చౌదరి మృతదేహం లభ్యమైంది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 4 Oct 2026 9:58 PM IST
Medchal
X

Medchal: మురహరిపల్లి చెరువు కట్టపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం!

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురహరిపల్లి చెరువు కట్టపై వ్యక్తి మృతదేహం లభ్యం, మృతుడు గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్న నేమారం చౌదరి 55 గా గుర్తింపు. గత రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయలుదేరిన మృతుడు, నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసిన కుటుంబ సభ్యులు.

మృతుడు 10 లక్షల నగదుతో ఇంట్లోనుండి బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన చేరుకుని దర్యాపు చేపడుతున్న మేడ్చల్ ఎసిపి శంకర్ రెడ్డి,సి ఐ అంజి రెడ్డి లు. ఇది హత్యనా లేదా ఆత్మహత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL