Miyapur: మియాపూర్ న్యూ హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపు దగ్ధం

Miyapur: మియాపూర్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం; వెల్డింగ్ షాపులో చెలరేగిన మంటలు పై అంతస్తు పెయింట్ షాపుకు వ్యాపించి సామాగ్రి దగ్ధం.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 21 Nov 2026 3:42 PM IST
Miyapur
X

Miyapur: మియాపూర్ న్యూ హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపు దగ్ధం

మియాపూర్‌: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ హఫీజ్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ భవనంలోని కింది అంతస్తులో గల వెల్డింగ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.క్షణాల్లోనే ఆ మంటలు పై అంతస్తులోని పెయింట్ షాపుకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.

షాపులో పెయింట్ డబ్బాలు, రసాయనాలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, పెయింట్ షాపులోని సామాగ్రి పూర్తిగా కాలిబూడిదై భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY