Miyapur: మియాపూర్‌లో ఓటరు జాబితా సవరణ పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ
Miyapur: మియాపూర్ డివిజన్ జేపీఎన్ నగర్‌లో ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అధికారులకు కీలక సూచనలు.
Miyapur: మియాపూర్‌లో ఓటరు జాబితా సవరణ పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్: జేపీఎన్ నగర్, మియాపూర్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.
మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీఎన్ నగర్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీ అరికెపూడి గాంధీ గారు ఈ రోజు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే ప్రజల్లో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు.




