Madinaguda: మదీనగూడ నారాయణ కళాశాలలో సైబర్ అవగాహన సదస్సు!
Madinaguda: మియాపూర్ మదీనగూడ నారాయణ కళాశాలలో "సురక్షా తిరంగా" సైబర్ అవగాహన సదస్సు. ఆన్‌లైన్ మోసాల పట్ల విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక.
Madinaguda: మదీనగూడ నారాయణ కళాశాలలో సైబర్ అవగాహన సదస్సు!
Madinaguda: సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని మియాపూర్ పోలీసులు సూచించారు. "సురక్షా తిరంగా" కార్యక్రమంలో భాగంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ నారాయణ జూనియర్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ సదస్సుకు సుమారు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డి.ఐ. విజయ్ మరియు సైబర్ వారియర్ సూర్యతేజ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల విస్తృత అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, ఫిషింగ్, ఫేక్ లింక్స్, OTP మోసాలతో పాటు ప్రమాదకరమైన లోన్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే సోషల్ మీడియాను సురక్షితంగా ఉపయోగించే పద్ధతులను నేర్పించారు.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే సమయంలో అపరిచితుల సందేశాలు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఒకవేళ ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఇతర పోలీస్ అత్యవసర పరిస్థితుల్లో ౧౧౨ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మియాపూర్ పెట్రోల్ కార్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




