Miyapur: వాసవి మార్కెటింగ్ ఆఫీస్ ఎదుట ఫ్లాట్ బాధితుల ఆందోళన

Miyapur: మియాపూర్ మంజీరా రోడ్డులోని 'వాసవి లేక్ సిటీ' గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కొనుగోలుదారులు వాసవి మార్కెటింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 24 Aug 2026 5:57 PM IST
Miyapur
X

Miyapur: వాసవి మార్కెటింగ్ ఆఫీస్ ఎదుట ఫ్లాట్ బాధితుల ఆందోళన

మియాపూర్: మియాపూర్ మంజీరా రోడ్డులోని 'వాసవి లేక్ సిటీ' గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ కొనుగోలుదారులు రోడ్డెక్కారు. కనీస సదుపాయాలు కల్పించకుండా తమను వేధిస్తున్నారంటూ వాసవి మార్కెటింగ్ కార్యాలయం ఎదుట బాధితులు సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.

ఆందోళనకు ప్రధాన కారణాలు:

అరకొర వసతులు: కమ్యూనిటీలో లిఫ్టులు సరిగా పనిచేయడం లేదని, విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మెట్లకు రేలింగ్ లేకపోవడం, పార్కులు సహా ఇతర ఏమ్యూనిటీస్ పూర్తి కాకపోవడంతో నిత్యం నరకం చూస్తున్నామని తెలిపారు.

ఒప్పందం ఉల్లంఘన: 2018లో రూ. 1.5 కోట్లు వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేశామని, 2023 నాటికి హ్యాండోవర్ చేస్తామని చెప్పిన బిల్డర్లు ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు.

GHMC తీరుపై మండిపాటు: ఎలాంటి ప్రాథమిక వసతులు లేవు అని తెలిసి కూడా జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు 'పార్షియల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్' (POC) ఎలా మంజూరు చేశారని బాధితులు ప్రశ్నించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం: సమస్యలపై వాసవి గ్రూప్ డైరెక్టర్లు ఎర్రం విజయ్ కుమార్, కండె శ్రీనివాస్, కండె రమేష్‌లకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఎలాంటి స్పందన లేదని, అందుకే నిరసనకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

తమకు తక్షణమే న్యాయం చేయాలని, ఒప్పందం ప్రకారం అన్ని వసతులు పూర్తి చేసి ఫ్లాట్లను అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story