Hafeezpet: హుడా కాలనీలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

Hafeezpet: హఫీజ్‌పేట్ హుడా కాలనీలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 28 July 2026 8:09 PM IST
Hafeezpet
X

Hafeezpet: హుడా కాలనీలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

హాఫీజ్పేట్: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని మహాముని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కాలనీవాసులకు, భక్తులకు కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండి, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మనోహర్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు ఆలయ నిర్వాహకులు, ఇతర నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story