Serilingampally: శేర్లింగంపల్లిలో ఘనంగా ఉచిత గొడుగుల పంపిణీ!

Serilingampally: కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత గొడుగులు పంపిణీ చేశారు. పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దీనికి హాజరయ్యారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Updated on: 6 July 2026 12:51 PM IST
Serilingampally
X

Serilingampally: శేర్లింగంపల్లిలో ఘనంగా ఉచిత గొడుగుల పంపిణీ!

Serilingampally: శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మహిళలకు తన చేతుల మీదుగా ఉచిత గొడుగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్‌ను అభినందించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళలకు గొడుగులు అందించడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలను చేపడతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు గారు,రజిని, కవిత, సంగీత, ఆశ, త్రిలోచ , మహిళలు తదితులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY

Next Story