Hyderabad: భాగ్యనగరవాసులకు అందుబాటులోకి తెలంగాణ రుచులు!
Hyderabad: హైదరాబాద్ మియాపూర్‌లో తెలంగాణ సాంప్రదాయ వంటకాల ప్రత్యేక రెస్టారెంట్ "బాగార బువ్వ కోడి కూర హోటల్" ఘనంగా ప్రారంభమైంది.
Hyderabad: భాగ్యనగరవాసులకు అందుబాటులోకి తెలంగాణ రుచులు!
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక వంటకమైన బాగార బువ్వ కోడి కూర హోటల్ మియాపూర్‌లో ప్రారంభమైంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హోటల్‌ను ప్రారంభించారు. ఐబీఎస్ విద్యార్థులు అభినయ్‌కుమార్, వినీత్‌రెడ్డి, సుకుమార్‌రెడ్డి, సందీప్ భాగస్వామ్యంతో ఈ హోటల్‌ను ఏర్పాటు చేశారు.
నగరవాసులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో హోటల్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంప్రదాయ రుచులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ బాగార బువ్వ, కోడి కూరను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగార బువ్వ కోడి కూరతో ఎంతో అనుబంధం, సెంటిమెంట్ ఉందన్నారు.
సంప్రదాయ వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత కూడా మంచి ఆలోచనలతో సొంత వ్యాపారంలోకి రావడం మంచి పరిమాణం అన్నారు. ప్రతీ ఒక్కరూ తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని దానిలో రాణించాలీ అన్నారు. హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.




