Charlapally: పేదలకు రేషన్ కిట్ల పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Charlapally: చర్లపల్లిలో ముకుల్ మాధవ్ ఫౌండేషన్, ఫినోలెక్స్ ఆధ్వర్యంలో పేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. రూ.1500 విలువై కిట్ల వితరణ.
Charlapally: పేదలకు రేషన్ కిట్ల పంపిణీ చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి: చర్లపల్లి లో సమాజ సేవే లక్ష్యంగా ముకుల్ మాధవ్ ఫౌండేషన్ (MMF), ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో చర్లపల్లిలో నిర్వహించిన భారీ ఉచిత రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నమోదు చేసుకున్న అర్హులైన పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఒక్కో కిట్ విలువ రూ.1,500 కాగా, పేద కుటుంబాలకు దీపావళి పండుగ వేళ నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ముకుల్ మాధవ్ ఫౌండేషన్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా 18 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాలలో మొత్తం 11,295 రేషన్ కిట్లను పంపిణీ చేస్తూ లక్షకు పైగా పేద ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు ముకుల్ మాధవ్ ఫౌండేషన్ సమాజం పట్ల బాధ్యతతో చేపట్టిన ఈ గొప్ప సేవా కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ముకుల్ మాధవ్ ఫౌండేషన్ 1999 నుంచి ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో విశేష సేవలందిస్తూ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తోంది. పూణేలోని KEM ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు, పేద విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్కాలర్షిప్లు, టీబీ ముక్త్ భారత్ అభియాన్‌కు మద్దతుగా పోషకాహార కిట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
చర్లపల్లి ప్రాంతంలో ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ పూణే, హైదరాబాద్ బృంద సభ్యులు, స్థానిక డిస్ట్రిబ్యూటర్ నల్లపాటి బసంత్ గుప్తా ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాస్ శ్రీనివాస్ రెడ్డి చర్లపల్లి BRS నాయకులు మహేష్, నాగారం బాబు ,జీఎం GLV బాబు చర్లపల్లి అసోసియేషన్ మాజీ చైర్మన్ రోషిరెడ్డి, దస్తగిరి రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




