Uppal: భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో ఎమ్మెల్యే పర్యటన

Uppal: భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్‌లో పర్యటించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్థానికుల సమస్యలు తెలుసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

KARUNAKAR, UPPAL
Published on: 9 May 2026 3:06 PM IST
Uppal
X

Uppal

Uppal: ఉప్పల్ భగాయత్ హెచ్ఎండిఏ లేఔట్ వెస్ట్ సైడ్ కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలోని పలు అపార్ట్మెంట్లను సందర్శించిన ఆయన, నివాసితులతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, వీధి దీపాల సమస్యలు, బయటనుండి చెత్త వేసి పోవడం, చెత్త సేకరణ లేకపోవడం, మౌలిక వసతుల కొరత వంటి అంశాలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాలనీలో నెలకొన్న తాత్కాలిక సమస్యలకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మేకల మధుసూదన్ రెడ్డి, శివప్రసాద్, డాక్టర్ రాఘవేందర్, శ్రీరామ్, సందీప్, విష్ణువర్ధన్ రెడ్డి, మల్లికార్జున్, కమల్, మహిపాల్, టీవీఎస్ఎస్ కృష్ణమూర్తి, ఆదిత్య, బాలకృష్ణ, నరోత్తం రెడ్డి, శేషాచారి, కృష్ణ, సందీప్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వాసవి మెట్రో పోలీస్ అపార్ట్మెంట్ వాసులు, అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story