Habsiguda: వేసవి తాపానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెక్
Habsiguda: హబ్సిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
Habsiguda: వేసవి తాపానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెక్
Habsiguda: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాలేరు జై నవీన్ ఆధ్వర్యంలో హబ్సిగూడ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎండల కాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు అధికమవుతాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ చల్లని త్రాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ప్రయాణికులు, వృద్ధులు, రోడ్డుపై వెళ్లే ప్రజలకు ఈ చలివేంద్రం ఉపశమనాన్ని కలిగిస్తుందని అన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరిశుభ్రమైన నీటిని అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పసుల ప్రభాకర్ రెడ్డి, సిహెచ్ లక్ష్మీనారాయణ, రజిత రెడ్డి,, మనోహర్, సంజయ్ జెన్, లింగ నాయక్, రవి నాయక్, కిషోర్ నాయక్, మొహమ్మద్ రహ్మాన్, కైసర్, నాని, రవి ప్రసాద్, మహేందర్, సందీప్, పైసల్ బాబు, మహేందర్ నాయక్, శృతి కుటుంబ సభ్యులు కాలేరు సురేందర్, కాలేరు ప్రణతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




