Mallapur: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం

Mallapur: మల్లాపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “అట్లాస్ ఫిట్‌నెస్ జిమ్”ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

HARISH, TARNAKA
Published on: 21 May 2026 10:32 AM IST
Mallapur
X

Mallapur: శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం

మల్లాపూర్: నూతనంగా ఏర్పాటు చేసిన “అట్లాస్ ఫిట్‌నెస్ జిమ్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన అట్లాస్ ఫిట్‌నెస్ జిమ్ స్థానిక యువతకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకునేలా జిమ్‌లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచడం పై నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, జిమ్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story