Kapra: రాధికా చౌరస్తాలో బీఆర్‌ఎస్ హోరెత్తించిన వంటావార్పు!

Kapra: కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై రాధికా చౌరస్తాలో బీఆర్‌ఎస్ వంటావార్పు పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మహిపాల్ రెడ్డి.

ASHOK, KAPRA
Published on: 4 Sept 2026 6:29 PM IST
Kapra
X

Kapra: రాధికా చౌరస్తాలో బీఆర్‌ఎస్ హోరెత్తించిన వంటావార్పు!

Kapra: రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఏఎస్‌రావునగర్‌ రాధికా చౌరస్తాలో వంటావార్పు నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రోడ్డుపైనే వంటలు చేసి భోజనాలు చేశారు. .ఈ సందర్భంగా చౌరస్తాలోని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పార్టీ పాటలకు అనుగుణంగా మహిళలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నాయకులు, కార్యకర్తల నినాదాలు, మహిళల నృత్యాలు, బోనాల సమర్పణతో రాధికా చౌరస్తాలో వంటావార్పు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, బండారి నీలంరెడ్డి, కొత్త రామారావు, షేర్‌ మణమ్మ, బేతాళ బాలరాజు, మురళి పంతులు, పెద్దాపురం కుమారస్వామి, గంప కృష్ణగుప్తా, శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వరి, సత్తమ్మ, చిన్న యాదవ్, షేక్‌ అబ్దుల్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. బిఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల పక్షాన తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

పేదలు, రైతులు, మహిళలు, యువత సమస్యలపై పాలకులు దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును ప్రజలకు వివరించేందుకు బిఆర్‌ఎస్‌ ఉద్యమాలను కొనసాగిస్తుందని అన్నారు. కాసం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో అనేకం కార్యరూపం దాల్చలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story