Meerpet: అల్లూరి విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మేల్యే లక్ష్మారెడ్డి!
Meerpet: మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
Meerpet: మీర్‌పేట్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు!
Meerpet: అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకల సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ పరిధిలోని గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, విగ్రహం వ్యవస్థాపకులు కృష్ణంరాజు
మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, కొత్త రామారావు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య. పూలమాలేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మహోన్నత వ్యక్తి అని, దేశానికి సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి అల్లూరి చేసిన పోరాటం స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, నిరుపేదలు,
నిరక్షరాస్యులు, అమాయకులైన అనుచరులతో, అతి తక్కువ యుద్ధ వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఢీకొన్న అల్లూరి సీతారామరాజు 27సంవత్సరాల వయసులోనే 1924 మే 7వ తేదీన స్వాతంత్ర ఫలాల కోసం అంతిమ శ్వాస విడిచాడని గుర్తు చేశారు.
రెండు సంవత్సరాల పాటు బ్రిటిషన్లకు కంటినిండా నిద్రలేకుండా గడగడలాడించిన వ్యక్తి అల్లూరి అని గుర్తు చేశారు. అనంతరం పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిళ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, ఉల్లెం బాలరాజు, నవీన్ గౌడ్, హరినాథ్ రెడ్డి, గడియారం రామకృష్ణ, కుమార్, సందీప్ యాదవ్, శేఖర్ గౌడ్, పూస రమేష్, జైపాల్, మధు వర్మ, డీవీఎస్ఎస్ఎన్ రాజు, జయారామరాజు, రామకృష్ణ, వాసురాజు తదితరులు పాల్గొన్నారు.




