Uppal: నియోజకవర్గంలో బోనాల కోలాహలం.. ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు!

Uppal: బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.

ASHOK, KAPRA
Published on: 9 Aug 2026 6:20 PM IST
Uppal
X

Uppal: నియోజకవర్గంలో బోనాల కోలాహలం.. ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు!

ఉప్పల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.బోనాలు కేవలం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మాత్రమే కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భక్తి విశ్వాసాలకు, తరతరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

పోతరాజుల వీరత్వం, డప్పుల దరువులు, అమ్మవారి ఘటాల ఊరేగింపులు, ఆడపడుచుల భక్తిశ్రద్ధలు తెలంగాణ జీవన సంస్కృతికి సజీవ రూపాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మన సంస్కృతి, భాష, యాస, పండుగలు ప్రజలను ఏకం చేసిన శక్తిగా నిలిచాయని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా కుషాయిగూడ జమ్మిగడ్డ సోనియా గాంధీనగర్ ఏఎస్ రావు నగర్ కాప్రా హౌసింగ్ బోర్డ్ పలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయాల వద్ద భక్తులను కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ, ప్రజలందరికీ బోనాల పండుగ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలను అందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు బాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాసం మహిపాల్ రెడ్డి నాగిళ్ల బాల్రెడ్డి ఆనంద్ కుమార్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story