Shadnagar: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!
Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు.
Shadnagar: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే!
Shadnagar: పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించి, భావితరాలకు ఆరోగ్యవంతమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం నిర్వహించిన ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వ్యాధి చిన్నారుల జీవితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నందున ముందస్తు నివారణే అత్యంత ముఖ్యమని తెలిపారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఏ ఒక్క చిన్నారికి కూడా పోలియో చుక్కలు వేయించకుండా వదిలిపెట్టవద్దని సూచించారు.
పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగాలంటే చిన్నతనం నుంచే తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పోలియో చుక్కలు వేయించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, ఆరోగ్య సిబ్బందికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.




