Tandur: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!

Tandur: తాండూరులో 261 మంది లబ్ధిదారులకు రూ.1.50 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు.

Srikanth Reddy, Tandur
Published on: 2 Sept 2026 10:00 PM IST
Tandur
X

Tandur: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!

తాండూరు: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 1,50,00,000/- (కోటి యాభై లక్షల) విలువ గల CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన కుటుంబాలకు ఒక అన్నలా సీఎం రేవంత్ రెడ్డి సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు.తెల్ల రేషన్ కార్డులను ప్రతి ఒక్కరికి అందించిన గనుక మన ప్రజా ప్రభుత్వానిదని తెలిపారు.నిరుపేదలకు ఉచితంగా కేజీ టు పీజీ విద్యను అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదనిఅన్నారు.బీఆర్ఎస్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసి మనకు మన ప్రభుత్వానికి భారంగా మిగిలిందన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌనిక వసతులు కలిపించామని తెలిపారు.11,000 మంది ఉపాధ్యాయులను నియామకం చేశామన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంప్రారంభించామని,విటమిన్స్ మినరల్స్ ఉన్న ఆహారాన్ని ప్రతి విద్యార్థికి అందిస్తున్నామని అన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేశామని అన్నారు.విద్యతో పాటు మానసిక ఆరోగ్యం కోసం క్రీడా కీట్టను విద్యార్థులకు ఇస్తున్నామని తెలిపారు.

బీఆర్ఎస్ 10 సంవత్సరంలో ఏమి అభివృద్ధి చేశారో, రెండున్నర సంవత్సరాలలో మేము ఎంత అభివృద్ధి చేశామో బహిరంగ చర్చకు మేము సిద్ధమని బిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.తాండూరులో ఏటీసీ తీసుకువచ్చామని జీవో తెచ్చామని బీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతుందని అన్నారు.

కోటిపల్లి ప్రాజెక్టు అభివృద్ధి కోసం 100 కోట్లు తీసుకుని వచ్చామని తెలిపారు. మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచాను. అన్ని రంగాల్లో తాండూరును అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యఅని అన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story