Khairatabad: బండి సంజయ్ కుమారుడి కేసులో రాజకీయం వద్దు.. దానం నాగేందర్

Khairatabad: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 15 May 2026 12:03 PM IST
Khairatabad
X

Khairatabad: బండి సంజయ్ కుమారుడి కేసులో రాజకీయం వద్దు.. దానం నాగేందర్

ఖైరతాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ కేసులో ఎలాంటి కక్షపురిత చర్యలకు తావుండదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిని మానవత్వదృక్పదంతో వ్యవహరించాలని. ఎలాంటి రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు.

ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉందనే విషయాన్ని వారు గ్రహించాలని హితవుపలికారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ , సీఎంఆర్ఎఫ్ చెక్కులను దానం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత మూడు నెలల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆరు కోట్ల వరకు ఆర్థిక సహాయాన్ని అందజేశామని. ముఖ్యమంత్రి చొరవతో ఇది సాధ్యం అయిందన్నారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story