Khairatabad: హైడ్రా వ్యవహారంలో నా పాత మాటలకే కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే
Khairatabad: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ 110 దేవాలయాలకు బోనాల చెక్కులను పంపిణీ చేశారు.
Khairatabad: హైడ్రా వ్యవహారంలో నా పాత మాటలకే కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే
ఖైరతాబాద్: హైడ్రా అంశంలో తాను గతంలో మాట్లాడిన మాటలు కట్టుబడి ఉన్నామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పేద ప్రజల గుడిసెల జోలికి వెళ్తే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. చెరువులు , నాళాలు కబ్జా చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారని దానం గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆనంద్ నగర్ కమ్యూనిటీ హల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ... ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 110 దేవాలయాలకు బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ... చెరువులు కబ్జాలకు గురికావడంతో భూగర్భజలాలు తగ్గిపోయి , నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. హైడ్రా ఆ చెరువులను , నాళాలను కబ్జాల నుండి కాపాడుతుందని టతెలిపారు.అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్ లు నిర్మించే బిల్డర్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ అనుమతులను తీసుకుంటున్నారని... దానిపై తాను అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడతానని దానం నాగేందర్ స్పష్టం చేశారు.




