Hyderabad: మహిళలే సమాజానికి వెన్నెముక ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Hyderabad: ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్డు వద్ద మహిళా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 14 Jun 2026 3:58 PM IST
Hyderabad
X

Hyderabad: మహిళలే సమాజానికి వెన్నెముక ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మహిళల సమావేశం ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి గారి ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఒక ప్రైవేట్ హాల్ నందు నిర్వహించిన మహిళల సమావేశంలో ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలే సమాజానికి వెన్నెముక అని, వారి అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, పార్టీ బలోపేతానికి మహిళా నాయకురాళ్లు మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళలు ముందుండి పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో మహిళల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని సుధీర్ రెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ మరియు సీనియర్ మహిళా నాయకురాలు సింగిరెడ్డి మల్లిశ్వరి రెడ్డి,డివిజన్ల మహిళ అధ్యక్షురాళ్లు నాగలక్ష్మి,లత,ఆదిలక్ష్మి,కొసనం ధనలక్ష్మి,అంజలి గౌడ్,శైలజ,శిల్పారెడ్డి,విజయగౌడ్,నియోజకవర్గ మహిళా నాయకురాలు రమాదేవి,కల్పన,శోభా,పావని,దేవి,ఉమా దేవి,విజయ లక్ష్మి,మేరీ,ప్రభావతి ఉద్యమకారులు కళపూర్ణ,వరలక్ష్మి,శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story