Hyderabad: ఎల్.బి.నగర్‌లో పేద మహిళకు రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత

Hyderabad: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు అండగా నిలుస్తున్నామని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 27 May 2026 3:57 PM IST
Hyderabad
X

Hyderabad: ఎల్.బి.నగర్‌లో పేద మహిళకు రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ అందజేత

హైదరాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నియోజకవర్గంలోని పేదలకు అండగా నిలుస్తున్నామని ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ జైపూరి కాలనీకి చెందిన రుక్మిభాయ్ వెన్నుపూస సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని సంప్రదించారు.

వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, బాధితురాలి వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దరఖాస్తు చేయించారు. దీనికి సంబంధించి రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు కాగా, బాధిత కుటుంబ సభ్యుడు రోహిత్‌కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా ఎంతో సంతృప్తి లభిస్తుంది. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది” అని పేర్కొన్నారు.

బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ తల్లి ఆరోగ్య సమస్య విషయంలో సుదీర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని, ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అనంతుల రాజిరెడ్డి, చైతన్యపురి యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ మహిళా నాయకురాలు శైలజ తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story