Hyderabad: చిన్నారి చికిత్సకు 'ఆపన్నహస్తం'.. ఎమ్మెల్యే దేవిరెడ్డి చొరవ

Hyderabad: ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చొరవతో వినికిడి సమస్యతో బాధపడుతున్న చిన్నారి శ్రీసిద్దికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 22 April 2026 5:08 PM IST
Hyderabad
X

Hyderabad: చిన్నారి చికిత్సకు 'ఆపన్నహస్తం'.. ఎమ్మెల్యే దేవిరెడ్డి చొరవ

Hyderabad: బాధిత తండ్రి సంతోష్ ఆనంద్ గారికి ఆరు లక్షల రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు. మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని అనిత నగర్ కాలనీ నందు నివాసం ఉండే సంతోష్ ఆనంద్ గారి కూతురు శ్రీసిద్ది (18 నెలలు) పుట్టుకతో చెవి వినికిడి సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థికస్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారిని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి గారు అట్టి ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.

దానికి గాను వారికి 6,00,000(ఆరు లక్షల రూపాయలు)ఎల్.ఓ.సీ.చెక్కు మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సీనియర్ భారస నాయకులు సామ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story