LB Nagar: సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఎస్‌ఎన్‌డీపీ పనుల పరిశీలన!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఎస్‌ఎన్‌డీపీ స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు.
LB Nagar: సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఎస్‌ఎన్‌డీపీ పనుల పరిశీలన!
LB Nagar: ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఈరోజు ఎస్.ఎన్.డీ.పీ. పనుల్లో భాగంగా సాగర్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న స్ట్రామ్ వాటర్ లైన్స్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రస్తుతం స్ట్రామ్ వాటర్ లైన్స్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం జరిగిందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిర్మిస్తున్న ఈ స్ట్రామ్ వాటర్ లైన్స్‌ను బైరామల్‌గూడ చెరువు వద్ద ఇప్పటికే నిర్మించిన స్ట్రామ్ వాటర్ డ్రైన్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పనులు సకాలంలో పూర్తయితే వర్షాకాలంలో వరద నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీలకు శాశ్వత పరిష్కారం లభించి, వరద నీటి సమస్య నుంచి పూర్తిస్థాయిలో విముక్తి లభించే అవకాశం ఉందని అన్నారు.
ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. రోహిణి, ఈ.ఈ. మాధవిలత, నాయకులు గండికోట శ్రీనాథ్, రవి ముదిరాజ్, చంద్రశేఖర్ రెడ్డి, ముద్ద కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




