Ibrahimpatnam: తారామతిపేట సమస్యలపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతి!
Ibrahimpatnam: తారామతిపేట సమస్యలపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. కల్వర్టు నిర్మాణానికి రూ. 15 లక్షలు మంజూరు చేశారు.
Ibrahimpatnam: తారామతిపేట సమస్యలపై ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతి
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు, మల్‌రెడ్డి రంగారెడ్డి గారిని కలిసి తారామతిపేట గ్రామంలోని పలు సమస్యలను గ్రామ ప్రజల తరఫున విన్నవించడం జరిగింది.ముఖ్యంగా జనచైతన్య వెంచర్‌లోని పార్కింగ్ స్థలంలో పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీకి సంబంధించిన వ్యర్థాలు, చెత్తను తరలించి వేయడానికి ప్రయత్నించగా గ్రామ ప్రజలు, యువకులు అడ్డుకుని మున్సిపల్ అధికారులను అక్కడి నుంచి పంపించడం జరిగింది.
ఈ విషయాన్ని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి, అక్కడ బంగారుమైసమ్మ దేవాలయం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యర్థాలు వేయవద్దని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు.
అదేవిధంగా, తారామతిపేట గ్రామంలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం పక్కన కల్వర్టు నిర్మాణం కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది.గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గారికి తారామతిపేట గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.




