Shankarpalli: శంకర్‌పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
Shankarpalli: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ. కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. మహిళా సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే వివరణ.
Shankarpalli: శంకర్‌పల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల నియోజకవర్గం: శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన స్థానిక చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను అందజేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




