Chevella: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య!
Chevella: నవాబుపేట్ ఎంపీడీవో కార్యాలయంలో 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.
Chevella: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య!
Chevella: నవాబుపేట్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద అర్హులైన 23 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.23,00,368 విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆడబిడ్డల వివాహం తల్లిదండ్రులకు ఆర్థికంగా భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేస్తోంది.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు




