Chevella: చేవెళ్లలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Chevella: చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 6 Sept 2026 3:25 PM IST
Chevella
X

Chevella: చేవెళ్లలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే!

Chevella: చేవెళ్ల పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందనున్నాయని పేర్కొన్నారు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story