Shankarpally: బోర్లు, మరుగుదొడ్లకు శంకుస్థాపన.. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం!

Shankarpally: శంకర్‌పల్లిలో ₹20 లక్షలతో బోర్ల నిర్మాణ పనులు, ₹15 లక్షలతో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 22 Nov 2026 11:22 AM IST
Shankarpally
X

Shankarpally: బోర్లు, మరుగుదొడ్లకు శంకుస్థాపన.. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం!

Shankarpally: చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా శంకర్‌పల్లి పట్టణంలోని బీడీఎల్ రోడ్డులో ఉన్న ఇస్తే మా ప్రాంగణంలో ₹20 లక్షల నిధులతో చేపట్టనున్న నూతన బోర్ల నిర్మాణ పనులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ₹15 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

అనంతరం శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు గణేష్ నగర్‌లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇస్తే మా కార్యక్రమానికి ఉపయోగించిన అనంతరం మున్సిపాలిటీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ₹20 లక్షలతో బోర్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అలాగే ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు ₹15 లక్షలతో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామని, వీటి ద్వారా ప్రజలకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ చేవెళ్ల నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA