Chevella: చేవెళ్ల మున్సిపాలిటీలో పర్యావరణ దినోత్సవం

Chevella: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మొక్కలు నాటారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 5 Jun 2026 4:58 PM IST
Chevella
X

Chevella: చేవెళ్ల మున్సిపాలిటీలో పర్యావరణ దినోత్సవం

చేవెళ్ల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చిన స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు.

చెట్లు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story