Amanagallu: విశ్వకర్మ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి!

Amanagallu: ఆమనగల్లు బ్రహ్మగిరి కొండపై ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. విశ్వబ్రాహ్మణుల సేవలు ప్రశంసనీయమని వెల్లడి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Sept 2026 10:44 PM IST
Amanagallu
X

Amanagallu: విశ్వకర్మ పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి!

ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని బ్రహ్మగిరి కొండపై గురువారం విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కాసోజు రాము ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో పట్టణానికి చెందిన విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విశ్వకర్మ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సమాజ నిర్మాణంలో విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు తమ వృత్తి నైపుణ్యంతో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. విశ్వకర్మ జయంతి వేడుకలను సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్, మార్కెట్ చైర్మన్ యాట గీత, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ నాయకులు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి రవి, కోశాధికారి జగదీశ్వరాచారి, మహేశ్వరం శ్రీనివాసచారి, కాసోజు శంకరాచారి, దార్ల రామకృష్ణ, పోలోజి బ్రహ్మం, శ్రీనివాసులు, జగదీష్, చంద్రమౌళి, శుభాష్, వీరాచారి, ప్రవీణ్, కోడొచ్చు మధు, రవికిరణ్ తదితరులు, స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY