Nizampet: నిజాంపేట్ ప్రజలకు గుడ్ న్యూస్! వరద ముంపుకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Nizampet: నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించారు.
Nizampet: నిజాంపేట్ ప్రజలకు గుడ్ న్యూస్! వరద ముంపుకు చెక్ పెట్టిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Nizampet: సిఎంసి నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధి బండారి లేఅవుట్, తుర్క చెరువు ప్రాంతాలలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రజా సమ స్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థా యిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎస్ఎన్డిపి పనుల వంటి వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వర్షం వచ్చిన ప్రతిసారి బండారి లేఔట్ లోని ప్రజలు వరద నీటి సమస్యతో భయాందోళనకు గురయ్యేవారని గత 12 ఏళ్ల కాలంలో ఎస్ఎన్డిపి పనుల ద్వారా వరద నీటి సమ స్యకు శాశ్వత పరిష్కారం చేశామని ఎస్ ఎన్ డి పి పనుల ద్వారా బండారి లేఔట్ లో వరద మంపు తీవ్రతను తగ్గించామని, రానున్న రోజుల్లో కూడా ఎస్ ఎన్ డి పి ఫేస్ 2 పనులను త్వరిత గతిన పూర్తి చేసి వరద ముంపు సమ స్పృశాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్
అధికారులతో కలసి తుర్క చెరువును సందర్శించిన ఎమ్మెల్యే చెరువులో ము రుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మురుగునీటిని బయటకు పంపించి వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆట సామాగ్రి తో పాటు చెరువును పూర్తిస్థాయిలో సుందరంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్య క్రమంలో డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ డీఈ నాయక్, ఈఈ సురేష్ బాబు, వాటర్ వర్క్స్ మేనేజర్ సౌమ్య, ఏఈ రవీంద్ర నాయక్, ఇంజ నీరింగ్ ఏఈ ప్రవీణ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, చందు ముదిరాజ్, ఆగం రాజు, బాలాజీ నాయక్, గాజుల సుజాత, మాజీ కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసింహా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు నరసింహారాజు, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రవి, పద్మావతి, లక్ష్మి సమాసింగ శ్రీదేవి, మాన్య తదితరులు పాల్గొన్నారు




