Kushaiguda: కుషాయిగూడ డివిజన్‌లో రూ.కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Kushaiguda: కుషాయిగూడ డివిజన్‌లోని వివిధ కాలనీల్లో రూ.3.95 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
Kushaiguda: కుషాయిగూడ డివిజన్‌లో రూ.కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Kushaiguda: కుషాయిగూడ డివిజన్ లో వివిధ కాలనీల్లో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఆర్‌సీసీ పైప్‌లైన్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పలు కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల వాటికి కేటాయించిన నిధులు వైష్ణవి ఎనక్లేవ్ – ₹36 లక్షలు, ఆదర్శ్ నగర్ – ₹20 లక్షలు. చక్రిపురం – ₹22 లక్షలు
లక్ష్మీనరసింహ కాలనీ – ₹26 లక్షలు , కుషాయిగూడ గ్రామం – ₹30 లక్షలు. భారత్ నగర్ – ₹29.70 లక్షలు. ధోబీఘాట్ – ₹19.80 లక్షలు. హనుమాన్ నగర్ – ₹17 లక్షలు, శివ సాయి నగర్ – ₹42 లక్షలు, మారుతి నగర్ – ₹25 లక్షలు, నాగార్జున నగర్ – ₹35 లక్షలు, సోనియా గాంధీ నగర్ – ఆర్‌సీసీ పైప్‌లైన్ పనులకు ₹25 లక్షలు, శ్రీనివాస్ ఎనక్లేవ్ – ₹40 లక్షలు.
ఇందిరా నగర్ – యూజీడీ పనులకు ₹27.50 లక్షలు ఈ అభివృద్ధి పనుల ద్వారా కాలనీల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు, స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన జీవన పరిస్థితులు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యల పరిష్కారం, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, పైప్‌లైన్ సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది.
ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి, కాలనీల వారీగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,BRS పార్టీ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




