Nacharam: పటేల్ కుంట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి!
Nacharam: నాచారం పటేల్ కుంట చెరువులోకి మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి!
Nacharam: పటేల్ కుంట చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి!
నాచారం: పటేల్ కుంట చెరువులోకి మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. నాచారం డివిజన్లోని చెరువును ఆయన సందర్శించి, మురుగునీటి మళ్లింపు పనుల పురోగతిని పరిశీలించారు. సుమారు నాలుగేళ్ల క్రితం రూ.1.80 కోట్లతో చేపట్టిన సివరేజ్ డైవర్షన్ పనులు 95 శాతం పూర్తయినా, కీలకమైన పనులు పెండింగ్లో ఉండటంతో ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయంపై ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఇటీవల చెరువులోకి వస్తున్న మురుగునీటిని డైవర్షన్ లైన్లోకి మళ్లించారు. మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేసి, వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకుఎమ్మెల్యే సూచించారు. చెరువులోకి మురుగునీరు, వ్యర్థ రసాయనాలతో కూడిన జలాలు చేరకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. చెరువు వద్ద నిర్మించిన 2.5 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రం ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే చెరువులోకి పంపించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన అనంతరం పటేల్ కుంటను కూడా అభివృద్ధి చేసి, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




