Hyderabad: రాధిక చౌరస్తాలో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహావిష్కరణ
Hyderabad: హైదరాబాద్ రాధిక చౌరస్తాలో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
Hyderabad: రాధిక చౌరస్తాలో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి విగ్రహావిష్కరణ
Hyderabad: రాజా బహదూర్ శ్రీ వెంకట రామారెడ్డి జయంతి సందర్భంగా రాధిక చౌరస్తా వద్ద ఆయన విగ్రహాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సమాజానికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి రాజా బహదూర్ వెంకట రామారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజా సేవకు, విద్యాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి ఆయన అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా వారి ఆదర్శాలను భావితరాలకు చేరవేయవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, పావని మణిపాల్ రెడ్డి , కొత్త అంజిరెడ్డి రెడ్డి ,సంధ్యారెడ్డి మధుకర్ రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




