Kukatpally: కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం పూజలు.

Kukatpally: చిత్తారమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే బోనాలు ఆలయాల అలంకరణకు నిధులు కేటాయించామని తెలిపారు.

Maruthisagar, Kukatpally
Published on: 9 Aug 2026 9:05 AM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లి చిత్తారమ్మ ఆలయంలో ఎమ్మెల్యే మాధవరం పూజలు.

బోనాల నిర్వహణకు ఆలయాలకు నిధులు కేటాయించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..

కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా ముత్యాలమ్మ, మైసమ్మ, మంకాలమ్మ, నల్లపోచమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల అలంకరణ, పూజా కార్యక్రమాలకు నిధులు కేటాయించిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్‌పల్లి చిత్తారమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్‌లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు, లాల్‌దర్వాజా బోనాలతో పాటు కూకట్‌పల్లిలో జరిగే చిత్తారమ్మ బోనాలు కూడా లక్షలాది మంది భక్తులతో అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో అలంకరణ, పూజా కార్యక్రమాల కోసం ప్రతి ఏటా నిధులు కేటాయించే విధానం గత ప్రభుత్వ హయాంలో కొనసాగిందని చెప్పారు. అదే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించి, ఏ ఆలయానికీ నిధుల కొరత లేకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని, కూకట్‌పల్లి ప్రజలు, కార్యకర్తలపై చిత్తారమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story