Ibrahimpatnam: కోహెడ అంతర్జాతీయ మార్కెట్ పనుల పరిశీలన

Ibrahimpatnam: సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన పనుల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఐఏఎస్ సురేంద్ర మోహన్.

AJAY, HAYATH NAGAR
Published on: 31 May 2026 5:06 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: కోహెడ అంతర్జాతీయ మార్కెట్ పనుల పరిశీలన

ఇబ్రహీంపట్నం: కోహెడ లో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత మార్కెట్ దేశానికే తలమానికంగా నిలుస్తుంది…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మెరుగైన ప్రమాణాలతో కూడిన మార్కెట్ గా ఉండబోతుంది. అదివారం ఉదయం కోహెడ మార్కెట్ శంకుస్థాపన నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ ముఖ్య కార్యదర్శి కె సురేంద్ర మోహన్ (IAS) ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయి .గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మరియు ఇతర ఉన్నత అధికారులు..పాలకవర్గం సభ్యులు కలిసి పరిశీలించడం జరిగింది.

అంతకుముందు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె సురేంద్ర మోహన్ (IAS) గారు కోహెడ గుట్ట శ్రీశ్రీశ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారితో పాటు అధికారులు సభ ప్రాంగణాన్ని తిరిగి పరిశీలించారు.. కొన్ని మార్పు చేర్పులను సూచనలను సంబంధిత అధికారులకు తెలియ చేశారు.

అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.

కోహెడ లో నిర్మించే మార్కెట్ దేశానికే దిక్సూచిగా మారుతుందని అన్నారు .అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడ పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు వ్యాపారులకు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు ఇట్టి మార్కెట్ లో ఉంటాయని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే ఇట్టి శంకుస్థాపన కార్యక్రమం లో వేలాది మంది రైతులు మహిళలు పాల్గొంటారని చెప్పారు.

రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.

కోహెడ లో ఏర్పాటు చేయబోతున్న మార్కెట్ ఇంకో 50 సంవత్సరాల అవసరాలకు దోహద పడుతుందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇట్టి మార్కెట్ లో కొత్త టెక్నాలజీతో పాటు మంచి ప్రమాణాలతో కూడిన మార్కెట్ ను నిర్మిస్తుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మి బాయి హాకా డైరెక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి (IAS) గిడ్డంగుల సంస్థ ఎండి కొర్ర లక్ష్మి (IAS) .

ఆగ్రోస్ ఎండి రాములు అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు రవికుమార్ గారు.తో పాటు గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ CH,భాస్కర చారి మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి L,శ్రీనివాస్ సభ్యులు పన్యాల జైపాల్ రెడ్డి బండి మధుసూదన్ రావు అంజయ్య మేకం లక్ష్మి రఘుపతి రెడ్డి నవరాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story