Malkajgiri: సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మర్రి

Malkajgiri: మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ వాణి నగర్ కాలనీలో రూ.54 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 May 2026 5:20 PM IST
Malkajgiri
X

Malkajgiri: సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మర్రి

మల్కాజిగిరి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి శనివారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వాణి నగర్ కాలనీ రోడ్ నెం.2లో రూ.54 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు,స్థానిక కాలనీవాసులు, నాయకులతో కలిసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ,ప్రతి కాలనీలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు డి.ఈ లౌక్య,ఏఈ దివ్య జ్యోతి,మాజీ కార్పొరేటర్ శ్రీమతి మేకల సునీత రాము యాదవ్,బీఆర్ఎస్ నాయకులు రావుల అంజయ్య,మేకల రాము యాదవ్,జేఏసీ వెంకన్న, బైరు అనిల్,భిక్షపతి, నర్సింగ్ రావు,ఖలీల్, సిద్ధిరాములు,శ్రీరాములు యాదవ్,నరహరి,కిట్టు, వాసు తదితరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story