Malkajgiri: కాంగ్రెస్ పాలనపై మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ ఆటో ర్యాలీ!

Malkajgiri: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 6 Sept 2026 11:55 PM IST
Malkajgiri
X

Malkajgiri: కాంగ్రెస్ పాలనపై మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ ఆటో ర్యాలీ!

మల్కాజిగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఆటోల ర్యాలీ నిర్వహించారు. వాజ్‌పేయి నగర్‌ రైల్వే గేట్‌ నుంచి ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌, వినాయక్‌నగర్‌, సఫీల్‌గూడ,ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ మీదుగా మల్కాజ్‌గిరి చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మల్కాజ్‌గిరి ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు,వీధి దీపాలు, శాంతిభద్రతలు,ట్రాఫిక్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు,మహిళలు, యువకులు,ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri

Next Story